calender_icon.png 11 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 17 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్

09-10-2024 12:26:28 AM

ముంబై:  క్రికెట్ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎమ్‌ఎల్)కు తెరలేవనుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు ముంబై, లక్నో, రాయ్‌పూర్ వేదికగా తొలి ఎడిషన్ జరగనుంది. ఈ మేరకు ఐఎమ్‌ఎల్ లీగ్ ట్రోఫీతో పాటు లోగోను మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జట్ల కెప్టెన్లు ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.

టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పాల్గొననున్నాయి. ఇండియా మాస్టర్స్ జట్టుకు దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహించనుండగా.. వెస్టిండీస్ మాస్ట ర్స్‌కు బ్రియాన్ లారా, లంక మాస్టర్స్‌కు సంగక్కర, దక్షిణాఫ్రికా మాస్టర్స్‌కు జాక్ కలిస్, ఇంగ్లండ్ మాస్టర్స్‌కు ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాస్టర్స్‌కు షేన్ వాట్సన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. టోర్నీలో భాగంగా నవంబర్ 17న తొలి మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్ తలపడనున్నాయి.