calender_icon.png 25 September, 2024 | 7:54 PM

వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి

25-09-2024 04:57:41 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,(విజయక్రాంతి): వచ్చే నెల 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నామని, వృద్ధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసం పొందాలని సూచించారు. వయోవృద్ధుల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గ్రాండ్ పేరెంట్స్ డే, వాక్ థాన్ కార్యక్రమాల్లో వృద్ధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు వుచ్చిడి మోహన్ రెడ్డి, సముద్రాల జనార్ధన్ రావు, కేశవరెడ్డి, సిడిపిఓ సబిత పాల్గొన్నారు.