calender_icon.png 1 October, 2024 | 6:42 PM

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

01-10-2024 03:27:26 PM

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం        

టాస్కా జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

జగిత్యాల,(విజయక్రాంతి): అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం  ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మంది వయో వృద్ధులను సన్మానించి మెమోంటోలు, వయోవృద్ధుల చట్టం పుస్తకాలు అందించారు.

ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ... తమ   సమస్యలను సత్వరం పరిష్కరించాలని  ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.ప్రత్యేక వయోవృద్ధుల శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీ తో నడుపుతున్న టోల్ ఫ్రీ నంబర్. 14567 ను రద్దుచేసి  ఆ స్థానంలో సత్వరమే స్పందించే 100,104 ల వలె ప్రభుత్వ టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని,వయోవృద్ధులకు అన్ని ఆసుపత్రుల్లోఉచిత వైద్య సేవలు అందించాలని, హైదరాబాద్ లో సీనియర్ సిటిజెన్ల భవనానికి 2 ఎకరాల స్థలం కేటాయించి, నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రoలోని అన్ని మున్సిపాలిటీల్లో వయో వృద్ధులకు డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, పెన్షనర్స్ జిల్లా సహాయ అధ్యక్షుడు పీసీ హన్మంత్ రెడ్డి, సీనియర్  సిటిజెన్ల ప్రతినిధులు ఎండి యాకూబ్,పబ్బా శివానందం, రాజ్ మోహన్, ఒజ్జల బుచ్చి రెడ్డి, సౌడాల కమలాకర్, సత్యనారాయణ, నారాయణ, ఎండి ఎక్బాల్, సయ్యద్ యూసుఫ్, జంగిలి రామానందం, దేవరశెట్టి జనార్ధన్, ధర్మ చొక్కారావు, రాపర్తి రాజేశం, భూమయ్య, కుందునూరి అనసూయ, గంగం జలజ, కరుణ, జిల్లా, డివిజన్, మండల, గ్రామాల, సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.