కరీంనగర్,(విజయక్రాంతి): అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వయోవృద్ధులకు "వాక్ థాన్" కార్యక్రమం నిర్వహించారు. మహాత్మ జ్యోతిబాపూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో వృద్ధులు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ వాక్ థాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వయవృద్ధులు నిత్యం యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. నడక ద్వారా వయోవృద్ధులు ఉల్లాసంగా జీవించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు సముద్రాల జనార్దన్ రావు, మోసం అంజయ్య, పెండ్యాల కేశవరెడ్డి, సిడిపివో సబిత, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.