05-03-2025 01:22:17 AM
హాజరుకానున్న పారిశ్రామికవేత్తలు
అమరావతి, మార్చి 4: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖ సహకారంతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా(ఏఎల్‌ఈఏపీ) ఈ నెల 7-9 తేదీల మధ్య ‘న్యూ జెన్-టెకేడ్ ఫర్ స ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ)- ప్రాస్‌పెరిటీ ఫర్ ఆల్’ అనే పేరుతో విజయవాడలోని నోవోటెల్ కేం అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది.
మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు, చట్టసభ సభ్యులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పలు శిక్ష ణా సంస్థలు పాల్గొననున్నాయి. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దృష్టి పెట్టుకుని కొత్తగా పుట్టుకొస్తున్న ట్రెం డ్లు, వ్యూహాలు, సాంకేతికతపై ఈ స మావేశంలో చర్చించనున్నారు.
ప్రపం చ స్థాయిలో పోటీ ఇవ్వడంతోపాటు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ఎంఎస్‌ఎంఈ లను బలోపేతం చేయాలనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, సర్క్యూలర్ ఎకానమీ అండ్ క్లుమైట్ పిన్‌టెక్, ప్రమోటింగ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, ట్రేడ్ అండ్ టెక్నాలజీ, సస్టెయిన బిలిటీ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ముఖ్య అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది.