calender_icon.png 2 April, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ హిత కృత్రిమ మేధస్సుపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

31-03-2025 07:39:51 PM

ఏప్రిల్ 3, 4 తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌..

ప‌టాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Gitam Deemed University) హైదరాబాద్ లో ఏప్రిల్ 3, 4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న‌ట్లు గీతం యూనివ‌ర్సిటీ సోమ‌వారం ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు కృత్రిమ మేధస్సు (ఏఐ), కమ్యూనికేషన్లు, ఇంజనీరింగ్, పారిశ్రామిక సాంకేతికతలో పురోగతులను సమీక్షించడానికి ఓ వేదికగా ఉపయోగపడనుంది. గ్రీన్ ఏఐ-2025 అత్యాధునిక పరిశోధన, వినూత్న పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యొక్క వాస్తవ ప్రపంచ అనువర్తనాలపై చర్చలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

వీటిలో కృత్రిమ మేధస్సు అండ్ డేటా సైన్స్, కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సిగ్నల్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఏఐ వంటివి ఉన్నాయి. ఈ సదస్సులో ఉత్తమ పరిశోధనా పత్రం, ఉత్తమ విద్యార్థి పరిశోధనా పత్రం, ఉత్తమ పరిశ్రమ పరిశోధనా పత్రాలకు అవార్డులనిచ్చి సత్కరించడంతో పాటు ఎంపిక చేసిన పరిశోధనా పత్రాలను స్ప్రింగర్ ప్రచురించనుంది. దక్షిణ కొరియా యోన్సే విశ్వవిద్యాయలం ప్రొఫెసర్ సంగ్-బే చో, ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ బిభుదత్త సాహూ, ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి, అట్ నెస్ట్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి నెహ్రూ బాబు ఈ సమావేశంలో ప్రముఖ వక్తలుగా పాల్గొంటారు. స్పాట్ రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం నందితా భంజా చౌధురి 9493 146 542, మనోజ్ కుమార్ పాత్ర 9937 362 143, లేదా greenai.conf@gmail.com కు ఈ-మెయిల్ చేయవచ్చ‌ని పేర్కొంది.