calender_icon.png 22 September, 2024 | 5:01 AM

కేఎల్‌హెచ్‌లో అంతర్జాతీయ సదస్సు

28-07-2024 12:31:43 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27(విజయక్రాంతి): కేఎల్‌హెచ్ హైదరాబాద్ అజీజ్‌నగర్ క్యాంపస్‌లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ ఆన్ సస్ట్రెనబుల్ డెవలప్‌మెంట్ ఇక్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ (5జీ  పేరిట నిర్వహించిన ఈ సదస్సుకు విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా మలేషియాకు చెందిన యూసీఎస్‌ఐ యూనిర్సిటీ డైరెక్టర్ డా.రేణు కొండలసామి, మలేషియా సిటీ యూనివర్సిటీకి చెందిన డా.యస్‌బి గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5జీ కమ్యూనికేషన్స్, జనరేటివ్ ఏఐ, ఏఐ అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఈ సదస్సుకు అమెరికా, సౌత్‌ఆఫ్రికా, వెస్టరన్ యూరప్, మలేషియా, చైనా, ఇతర దేశాల నుంచి ప్రతినిధులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పించారు.

డా.సబత్ మల్ సామ్రాట్ ఆర్‌అండ్‌డీ డైరెక్టర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు పాల్గొని 6జీ కమ్యూనికేషన్స్ ప్రాముఖ్యత గురించి ప్రతినిధులకు తెలియజేశారు. కేఎల్‌హెచ్ హైదరాబాద్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో పరిశోధనల అభివృద్ధ్దికి పెద్దపీట వేస్తామని చెప్పారు. తమ ప్రొఫెసర్లను ప్రముఖ యూనివర్సిటీలకు పంపి పరిజ్ఞానాన్ని పెంచుకునేలా తమ యాజమాన్యం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

సదస్సు ఉద్దేశాన్ని సదస్సు కన్వీనర్ డా.బూదాటి అనిల్‌కుమార్ వివరించారు. ఈ సదస్సులో దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన 40మంది పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేఎల్‌హెచ్ హైదరాబాద్ యూనివర్సిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కోనేరు హవిష్, సదస్సు కన్వీనర్ డా.బూదాటి అనిల్‌కుమార్, ప్రిన్సిపాల్ అకెల్ల రామకృష్ణ, హెచ్‌వోడీ డాక్టర్ ఎం.గౌతమి, కన్వీనర్ డా.అనిల్‌కుమార్‌ను టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది అభినందించారు.