13-03-2025 12:00:00 AM
పీయూ ప్రిన్సిపాల్ డా మధుసూదన్ రెడ్డి
పాలమూరు యూనివర్సిటీ మార్చి 12 : పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ లో రెడ్ క్రాస్, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ లు సంయుక్తంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ ల 94 వ వర్ధంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ రక్తదాన శిబిరం బ్రోచర్ ను ప్రిన్సిపాల్ డా మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డా నటరాజ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రక్త దానం చెయ్యడం ద్వారా ఆపద లో ఉన్న వారి ప్రాణాలను రక్షించ్చవచ్చని, ప్రమా దాలు జరిగినప్పుడు సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతు న్నారని, యువత రక్తదానం చేసి, ప్రాణ దాతలు కావాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా కృష్ణయ్య , రాజనీతి శాస్త్ర విభాగధిపతి డా కుమార స్వామి, సోషల్ వర్క్ విభాగధిపతి డా పర్వతాలు , యాదరాజ్, ప్రోగ్రాం అధికారులు డాగాలేన్న, డా రవికుమార్, డా ఈశ్వర్ కుమార్, డా జ్ఞానేశ్వర్, అధ్యాపకులు డా శ్రీనివాస్, పాల్గొన్నారు.