* అభినందించినవీసీ కుమార్ మొలుగారం
హైదరాబాద్ సిటీబ్యూరో,డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాజస్థాన్ జోధ్‌పూర్‌లో యూజీసీ ఆధ్వర్యంలో జరిగిన 16వ ప్రకృతి లఘుచిత్ర ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ చిత్ర రూపకర్త ఈఎంఆర్సీ డైరెక్టర్ పి.రఘుపతి అవార్డు అందుకోవడం అభినందనీయమని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొ. కుమార్ మెలుగారం అన్నారు. ఈనెల 4 జరిగిన ఈ పోటీల్లో ట్రోఫీ, నగదు బహుమతి, ధ్రువపత్రాలను పొందిన వారు వీసీని కలిశారు.
ఈ సందర్భంగా గొత్తి కోయ చిన్నారులకు విద్యాభ్యాసం కోసం 9 ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసిన ఓయూ విద్యార్థుల(ఇస్రం సంతోష్, దూడపాక నరేష్, శశిధర్‌రెడ్డి, చందా గున్నమంతరావు)ను వీసీ అభినందించారు. ఈ లఘుచిత్రానికి వచ్చిన రూ.50వేల నగదును వారికి విరాళంగా అందించారు.
ఈ అవార్డు తనకు మరింత సామాజిక బాధ్యతను పెంచిందని ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి అన్నారు. ఓయూకు ఈ విభాగంలో అవార్డు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.నరేష్‌రెడ్డి, లావణ్య, ప్రొ.ప్యాట్రిక్, రిటైర్డ్ ప్రొ. స్టీవెన్‌సన్, ప్రొ.నరేందర్ సహా పలువురు లఘుచిత్రాన్ని వీక్షించారు.