09-03-2025 12:39:14 AM
ప్రాజెక్టు వర్క్‌కు ఇంటర్ బోర్డు యోచన
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఇంటర్‌లో ఇంటర్నల్స్ పెట్టే విషయమై ఇంటర్ బోర్డు అధికారులు యోచిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు, అభ్యాసన కార్యకలాపాల్లో వారిని భాగస్వామ్యం చేసి, విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 80 శాతం మార్కులు వార్షిక పరీక్షలకు, మిగిలిన మార్కులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ వర్క్‌లకు కేటాయించాలని భావిస్తోంది.