calender_icon.png 7 February, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్‌డోర్ గేమ్స్‌తో అంతర్గత సామర్థ్యం

07-02-2025 01:16:46 AM

ఐఐఎంసీ కాలేజీలో ముగిసిన మహిళా క్యారమ్స్ టోర్నమెంట్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఇన్‌డోర్ గేమ్స్ ద్వారా అంతర్గ త సామర్థ్యం మెరుగవుతుందని వక్తలు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఐఐఎంసీ కాలేజీలో నిర్వహించిన అంతర్ కళా శాలల మహిళా క్యారమ్స్ టోర్నమెంట్ గురువారం ముగిసింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ ఓయూ ఆధ్వర్యంలో వివిధ ఆటల్లో టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓయూ బీఓసీ సెక్రటరీ ప్రొఫెసర్ దీప్ల, ప్రొఫెసర్ సునీల్‌కుమార్, ఐఐఎంసీ కాలేజీ ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడు తూ క్రీడలు శరీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు.

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొని వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్ మనస్విని అభినందించారు. అనంతరం క్యారమ్స్ టోర్నమెం ట్‌లో మొదటి స్థానం పొందిన సెయింట్స్ ఆన్స్ కళాశాల, ద్వితీయస్థానం పొందిన కస్తూరిబా డిగ్రీ కళాశాల, మూడోస్థానంలో నిలిచిన ఎస్‌ఎన్‌వీఎంవీ కళాశాల, నాలుగోస్థానంలో నిలిచిన సెయింట్ జోసెఫ్ కళాశా ల విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సంతోషి, తిరుమలరావు, పీడీ కిషన్, వివిధ కాలేజీల పీడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.