జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఫిబ్రవరి 3 నుండి 22 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు(Intermediate Practical Exams) ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్(Additional Collector Shivendra Pratap) ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటర్మీడియట్(వొకేషనల్) మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, 13 కేంద్రాల్లో వొకేషనల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులు 8392 మంది, వొకేషనల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు మొదటి సంవత్సరం 1996 మంది,రెండవ సంవత్సరం 1721 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షకు జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్, త్రాగునీరు ఏర్పాటు చేయాలని పారిశుధ్య పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం లో ఆశా వర్కర్ ను వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్ టి సి బస్సులు పరీక్షల రూట్స్ లలో నడపాలని విద్యార్థులు ఎక్కడకూడా ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ల్యాబ్లలో,bకారిడార్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్.పి రాములు,అర్.డి. ఓ నవీన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి శ్రీమతి కౌసర్ బేగం, ఆర్టీసీ, పోస్టల్, పోలీస్, విద్యుత్, మున్సిపల్ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.