05-03-2025 07:13:05 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పరీక్ష కేంద్రాల్లో 1128 మంది విద్యార్థులకు 41 మంది గైర్హాజరుకాగా 1087 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా గంటముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
కొందరు విద్యార్థులు సమయానికి అక్కడ చేరుకోగా వారు పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 429 మంది విద్యార్థులకు గాను 415 మంది హాజరయ్యారు. బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 414 మంది విద్యార్థులకు గాను 398 మంది హాజరయ్యారు. బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 285 మంది విద్యార్థులకు గాను 274 మంది హాజరయ్యారు.