04-03-2025 11:05:10 PM
నోడల్ ఆఫీసర్ సలాం..
కామారెడ్డి (విజయక్రాంతి): 2024-25 విద్యా సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని నోడల్ ఆఫీసర్ సలాం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాల్లో అవసరమైన తాగునీరు ఫర్నిచర్ వైద్యము విద్యుత్తు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రతీ ఏటా మాదిరి 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ముఖ్యంగా మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు 90 రోజుల ప్రత్యేక తరగతులను నిర్వహించాము అందుకు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాస్తారని ఆఫీసర్ ధీమా వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఉదయం 8:15 నిమిషాలకు నుంచి అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష పత్రాలను సీసీ కెమెరాలు ముందు తెరవాలని పరీక్షా సంబంధిత అధికారులకు సూచించినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్, వస్తువులు తీసుకురాకుండా చూడాలని సిఎస్ సంబంధిత అధికారులకు చూడాలని సూచించినట్టు తెలిపారు. విద్యార్థులందరికీ హాల్ టికెట్లు అందినట్లు తెలిపారు.
జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం 8743 మంది, సెకండ్ ఇయర్ 9729 మంది మొత్తం 18,472 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. ఇక జిల్లాలో 19 ప్రభుత్వ కళాశాలలో గవర్నమెంట్ సెక్టార్ కళాశాలలో 10 ప్రైవేటు 9 కేంద్రాలు అర్బన్ 20 రూరల్ 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సీసీ కెమెరాలు నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షల కోసం 38 చీఫ్ సూపరింటెండెంట్ లు, 38 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, ఫ్లైయింగ్ కార్డ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.