calender_icon.png 16 March, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసక్తికరంగా కుస్తీ పోటీలు

17-12-2024 12:57:05 AM

జుక్కల్, డిసెంబర్ 16: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో దత్త జయంతిని పురస్కరించుకొని వారం రోజుల పాటు భజనకీర్తనలు నిర్వహిస్తారు. చివరి రోజైన సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేం దుకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పాల్గొని, తలపడ్డారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు వెండి కడియాలు, నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుక్మిణిబాయివిఠల్‌రావు, మాజీ జడ్పీటీసీ మాధవ్‌రావు దేశాయ్, సందీప్‌పటేల్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్‌రావు పాల్గొన్నారు