29-03-2025 07:28:27 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అపెక్స్ సెంట్రల్ స్కూల్ బాయమ్మతోట పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా, ఇతర అధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థులు పాఠాలు బోధించారు, సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రామారావు, ఏవో నాగమణి ప్రిన్సిపాల్ చైతన్య మాట్లాడుతూ... ఈ కార్యక్రమం విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించిందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.