ఈపీఎఫ్ ట్రస్టీల బోర్డు నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్ 30:ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు వారి సెటిల్‌మెంట్ తేదీ వరకూ ఈపీఎఫ్ నిల్వపై వడ్డీ చెల్లించాలని సంస్థ సెంట్రల్ ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎఫ్ స్కీమ్ 1952 చట్ట సవరణ ప్రతిపాదనను శనివారం సమావేశమైన బోర్డు ఆమోదించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ నెలలోనైనా 24వ తేదీ వరకూ జరిగే సెటిల్‌మెంట్‌కు అంతక్రితం నెలాఖరు వరకూ మాత్రమే వడ్డీ చెల్లింపు జరుగుతున్నది. సవరణ అనంతరం సెటిల్‌మెంట్ తేదీ వరకూ వడ్డీ చెల్లించనున్నందున, ఈపీఎఫ్‌వో సభ్యులకు మరింత ఆర్థిక ప్రయో జనం కలుగుతుంది.