19-03-2025 02:00:46 AM
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
కరీంనఃగర్ క్రైమ్, మార్చి18(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాపి పథకాన్ని ప్రకటించాలని బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి జిహెచ్‌ఎంసి పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు.
మిగిలిన మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షేమ పరిస్థితుల్లో మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని కోరారు. నగరంలో సామాన్యులు మధ్యతరగతి ఇంటి యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక అధికారులు లక్షల్లో బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు ’బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆరె రవి గౌడ్ చేతి చంద్రశేఖర్ జెల్లోజి శ్రీనివాస్ ఇర్ఫాన్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుండెల్లి రాజకుమార్, ఒడ్నాల రాజు సత్తినేని శ్రీనివాస్ నయీమ్ నర్సింగా రావు పాల్గొన్నారు.