calender_icon.png 28 October, 2024 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెట్టుబడులకు పెద్ద కంపెనీల ఆసక్తి

12-08-2024 12:13:51 AM

టీజీటీఎస్‌డీసీ చైర్మన్ మన్నె సతీశ్ 

హైదరాబాద్, ఆగస్టు 11(విజయక్రాంతి): దేశంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీటీఎస్‌డీసీ) చైర్మన్ మన్నె సతీశ్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు మరిన్ని పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. నగరంలోని గచ్చిబౌలిలో స్నాడ్ డెవలపర్స్ ఇండియా ఆధ్వర్యంలో టెక్ ట్రెకట్. పేరుతో టెక్నాలజీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ రంగ నిపుణులు పాల్గొని వివిధ సాప్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులు, నిర్వహకులకు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక మాంద్యానికి సబంధించి అంశాలపై విశ్లేషించారు.

ఈ సందర్భంగా మన్నె సతీశ్ మాట్లాడుతూ.. ఐటీ అభివృద్ధికి ఇలాంటి సదస్సులు ఎంతో అవసరమని, ప్రతి కంపెనీ ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. స్నాడ్ డెవలపర్స్ ఇండియా సీఈవో నందిగమ్ నాగదీప్తి మాట్లాడుతూ.. ఐటీ పరిశ్రమల భవిష్యత్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సాప్ట్‌వేర్ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే నిర్ణయంతో ఈటెక్ ట్రెక్ నిర్వహిస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో 50 ఐటీ కంపెనీల నుంచి దాదాపు 300 మంది ఐటీ నిపుణులు పాల్గొన్నారు.