calender_icon.png 21 April, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 లక్షల వరకు వడ్డీలేని రుణాలివ్వాలి

10-04-2025 02:21:24 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): మహిళలకు స్వావలంబన కల్పించేందుకు కేంద్రం వారికి రూ.15 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క విత డిమాండ్ చేశారు. రూ.16.5 లక్ష ల కోట్ల మేర కార్పొరేట్లకు రుణ మాఫీ చేసిన మోదీ సర్కార్ మహిళలకు లో న్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు బుధవా రం కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలకు 20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్టు అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. మహిళల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం గ్యాస్ ధరను పెంచి పేద, మధ్యతరగతిపై భారం పెంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటే మన దేశంలో మాత్రం ధరలు పెరుగుతు న్నాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రూప్‌సింగ్, జాగృతి నాయకురాలు మాధవి ఉన్నారు.