calender_icon.png 30 January, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం వల్ల రైతులపై వడ్డీభారం రూ.11,145కోట్లు

30-01-2025 02:08:19 AM

  • సిద్దిపేట జిల్లాలోని ఆయిల్‌పామ్ యూనిట్‌ను జూన్ వరకు పూర్తిచేయాలి 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి):  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుం టుందని విశ్వసించే ప్రభుత్వం తమదని, అందుకే రాష్ట్ర బడ్జెట్‌లో 35 శాతం నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ కూడా ఏక కాలంలో చేయకపోవడంతో రూ.11,145 కోట్ల వడ్డీభారం రైతులపై పడిందని తెలిపారు.

బుధవారం సచివాలయంలో మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ జూన్ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌పామ్ గెలల ప్రాసెసింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.

బీచ్‌పల్లి, కల్లూరుగూడెంలలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులను ప్రారంభించాలన్నారు. దీనివల్ల ఆయిల్‌పామ్ సాగు చేపడుతున్న కొత్త జిల్లాల్లోని రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందుకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరుమీదకు మార్చుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.