calender_icon.png 16 January, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి వేదికగా ఇంటర్ కాంటినెంటల్ కప్

04-09-2024 12:55:45 AM

ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీకి నగరంలోని గచ్చిబౌలి స్టేడియం ముస్తాబయింది. మంగళవారం నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీకి తెరలేచింది. ఈ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఫుటబాల్ పోటీలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్, తెలంగాణ ఫుట్‌బాల్ ప్రియుల తరఫున ఆటగాళ్లందరికి స్వాగతం.

నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ను దేశానికి క్రీడా రాజధానిగా మార్చాలన్నదే మా ప్రయత్నం. టోర్నీలో పాల్గొననున్న జట్లకు, ఆటగాళ్లకు నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. మంగళవారం మారిషస్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. ఆ తర్వాత సెప్టెంబర్ 9న సిరియాతో ఆడనుంది. కార్యక్రమంలో శివసేన, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.