04-03-2025 04:38:05 PM
పెద్దపల్లి జిల్లా నోడల్ అధికారి కల్పన
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు ఆన్లైన్ లో పొందచ్చని పెద్దపల్లి జిల్లా నోడల్ అధికారి కల్పన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంటర్ విద్యార్థులు తమ కాలేజ్ ఫీజు కట్టలేదని, పలు కాలేజీల్లో హాల్ టికెట్లు ఇవ్వడం లేదని వచ్చిన ఆరోపణలపై జిల్లా నోడల్ అధికారి స్పందించారు. https://tgbie.cgg.gov.in వెబ్సైట్లో నుంచి తీసుకొని స్టాంప్ లేకుండా నేరుగా పరీక్షలు రాయవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య ఆరోగ్య, సాగునీటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఒత్తిడికి లోనవకుండా ఉన్నత ఫలితాలు సాధించాలని ఆమె సూచించారు.