21-02-2025 12:17:41 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని యెల్లందు క్రాస్ రోడ్స్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల(Sri Chaitanya Junior College)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డి యోగ నందిని (16) శుక్రవారం ఉదయం చదువుకునే సమయానికి హాజరైంది. తరువాత, ఆమె తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని(hanging) కనిపించింది. యోగ నందిని స్వస్థలం భద్రాచలం(Bhadrachalam) దగ్గర ఎటపాక మండలం చింతలగూడెంకు చెందినది. యువతి మృతికి కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నందిని ప్రాణాలు తీసుకుందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.