calender_icon.png 26 October, 2024 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

02-08-2024 12:05:00 AM

కళాశాల ఎదుట బాధితుల ఆందోళన

హనుమకొండ, ఆగస్టు 1 (విజయక్రాంతి): హనుమకొండలోని నక్కల గుట్ట వైబ్రెంట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములు గు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఏనుముల సుమత రాజిరెడ్డి దంపతుల కూతురు భవానీ (15) వైబ్రెంట్ కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులంతా నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 10 గంటల సమయంలో భవానీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

గమనించిన హాస్టల్ వార్డెన్ బాధితురాలిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ భవానీ మృత్యువాతపడింది. ఈ విష యం తెలుసుకున్న భవానీ కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కళాశాల యాజమాన్యమే తన బిడ్డను పొట్టన పెట్టుకుందని తల్లి సుమత ఆరోపించారు.

బాధితులకు మద్దతుగా విద్యా ర్థి సంఘాలు పెద్దసంఖ్యలో కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. భవానీ మృతి పై అనుమానాలున్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి బాధితు కుటుంబంతో మాట్లా డి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఘటనపై విచా రణ చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.