calender_icon.png 7 February, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెక్చరర్ల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య?

07-02-2025 12:00:00 AM

దుర్గం చెరువులో దూకిన ఇంటర్ విద్యార్థి 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6: దుర్గం చెరవులో దూకి ఓ స్టూ  ఆత్మహత్య చేసుకున్న ఘ  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇబ్రహీంపూర్‌కు చెందిన రవీంద్రకు  తన కుటుంబంతో మియాపూర్ జేపీ నగర్ ఏలియన్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.

తన కొడుకు రుద్రసింగ్(18)ను ఫి  కోచింగ్ నిమిత్తం విద్యాపీఠ్, కావూరి హిల్స్‌లోని ఫిజిక్స్ వాలా ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించాడు. రుద్రసింగ్ చదువు ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 1న మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం మృతదేహం లభ్యం అయింది.

అయితే లెక్చరర్ల ఒత్తిడితోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదువు పేరుతో ఒత్తిడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. ఫిజిక్స్ వాలా ఇన్‌స్టిట్యూ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్సై మాణిక్యరెడ్డి తెలిపారు.