calender_icon.png 19 January, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

19-01-2025 02:57:44 PM

పాపన్నపేట: కాలేజీకి పొమ్మనందుకు మనస్తాపం చెంది ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా(Medak district ) పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్ పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరిగే కృష్ణ కూతురు సింధూజ(19) మెదక్ పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. గత నెల రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో దిగులుగా ఉంటుంది. కుటుంబీకులు కళాశాలకు కచ్చితంగా వెళ్ళమని చెప్పడంతో క్రమంలో ఆవేశానికి గురైన సింధూజ శనివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబీకులు ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. వెంటనే కుటుంబీకులు గమనించి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందింది. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.