calender_icon.png 3 January, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

31-12-2024 10:33:55 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండలం కిష్టాపురంకు చెందిన సాయి వర్ధన్ అనే విద్యార్థి ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రి ఇంటి నుంచి ఎస్సీ గురుకుల కళాశాలకు వచ్చిన సాయి వర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాథీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సాయి వర్ధన్ మృతితో విద్యార్థి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.