అనంతపురం,(విజయక్రాంతి): ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కమలానగర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రామాపురానికి చెందిన చరణ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కళాశాలలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా, ఇవాళ ఉదయం 10:15 గంటలకు విద్యార్థి తరగతి గది నుండి బయటకు వెళ్లి, మూడవ అంతస్తు నుండి దూకినట్లు ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన నిఘా కెమెరాలో రికార్డైంది. విద్యార్థి చరణ్ బిల్డింగ్ పై నుండి దూకినప్పుడు గట్టిగా శబ్దం రావడంతో ఏమి జరిగిందో చూడటానికి సహవిద్యార్థులు గది నుండి బయటకు వచ్చారు. చరణ్ సూసైడ్ చేసుకున్నడన్న విషయం తెలియడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.