22-04-2025 12:00:00 AM
విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.