calender_icon.png 15 April, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు!

14-04-2025 02:02:48 AM

విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న ఇంటర్ బోర్డు

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లో విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏపీలో వాట్సాప్ పాలన కోసం చేపట్టిన మన మిత్ర తరహాలో మన దగ్గర కూడా విద్యార్థులు వాట్సాప్‌లో ఫలితాలను వీక్షించేలా మార్పులు తీసుకురావాలని భావిస్తోంది.

ఇందుకు ఒక ప్రత్యేక నంబర్ ను రూపొందించాలని యోచిస్తోం ది. అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్ సహాయంతో ఫలితాలు, స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సేవలను ప్రారంభించే ముందు సాంకేతిక అంశాలు, ఏర్పాట్లను పరిశీలిస్తోంది.

ఈ ఏడాది వార్షిక పరీక్ష ల ఫలితాల కోసం కాకపోయినా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల నాటికైన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.