calender_icon.png 20 April, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న ఇంటర్ ఫలితాలు

20-04-2025 12:34:27 AM

  1. విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  2. ఆతృతగా ఎదురుచూస్తున్న 9.96 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు శనివారం అధికారికంగా ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవనున్నారు.

ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ నుంచి 4.88 ల క్షలు, సెకండియర్ నుంచి 5 లక్షలకు పైగా ఉన్నారు.

మార్చి 18 నుంచి సమాధాన పత్రాలను మూల్యాంక నం చేశారు. ఫలితాల తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.