calender_icon.png 19 April, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21న ఇంటర్ ఫలితాలు!

16-04-2025 01:51:32 AM

ఆతృతగా ఎదురు చూస్తోన్న 9.96 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమాధానపత్రాల మూల్యాంకనం ముగియడంతో తదుపరి ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

మార్చి 5 నుంచి 25 వరకు రాష్ర్టవ్యాప్తంగా 1,532 కేంద్రాల్లో నిర్వ హించిన ఇంటర్ పరీక్షలకు మొదటి సంవత్సరం నుంచి 4,88,448 మంది, రెండో సంవత్సరం నుంచి 5,08,253 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 9,96,971 మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఈసారి ఫలితాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేయనున్నారు. ముఖ్యం గా సున్నా మార్కులు, తక్కువ మా ర్కులు వచ్చిన విద్యార్థుల సమాధాన పత్రాలను పలుమార్లు సరి చూసుకొని ఎటువంటి తప్పులు జ రగలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మార్కులను అప్‌లోడ్ చేయ నున్నారు.