- 454 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
పర్యవేక్షణకు 5 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 454 పరీక్ష కేంద్రా ల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఫిబ్రవరి 22 వరకు జరిగే ఈ ప్రాక్టికల్స్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లాలోని 397 జనరల్, 57 ఒకేషనల్ కాలేజీల నుంచి 42,501 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కానున్నారు.
ఈ పరీక్షల పర్యవేక్షణకు జిల్లాలో 5 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, ప్ర తీ పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటికే పరీక్ష సామాగ్రిని ఎగ్జామ్ సెంటర్లకు అధికారులు పంపిణీ చేశారు. ప్రాక్టికల్స్ నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ డీఐఈవో ఈ ఒడ్డెన్న తెలిపారు. విద్యా ర్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షాకేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.