- సీసీ కెమెరాలు పెట్టలేమని తేల్చి చెప్పిన ప్రైవేటు కళాశాలలు
- ప్రభుత్వ కళాశాలలో మాత్రమే సిసి నిఘాలో పరీక్షలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో గందరగోళ వాతావరణం
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఓవైపు ఇంటర్ బోర్డు సిసి నిఘా పర్యవేక్షణలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాల్సి ఉందని తేల్చి చెప్పగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం మాత్రం అందుకు వ్యతిరేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే స్తోమత లేదంటూ సీసీ కెమెరాల బిగింపుపై అలసత్వం వహించారని తెలు స్తోంది.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం సిసి నిఘ సమక్షంలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థుల్లో గందరగోల వాతా వరణం నెలకొంది. సోమవారం ఉదయం నుండి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టిక ల్స్ పరీక్షలకు అధికారులు అంతా ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ప్రైవేటు కళాశాలల సెంటర్లో మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో కొత్త సమస్య వచ్చి పడింది.
ఇంటర్ బోర్డు మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ సిసి నిఘా సమక్షంలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరపాలని తెగేసి చెప్పడంతో అస లు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వి ద్యార్థుల్లో నెలకొంది. ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో యాజమాన్యాలు ప్రాక్టికల్స్ పరీక్షల్లో పాస్ గ్యారంటీ పేరుతో వసూళ్లు కూడా చేసినట్లు ఆరోపణలు వెలువె త్తుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా..
జనరల్ 38, ఒకేషనల్ మరో ఐదు పరీక్ష కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా 43 సెంటర్లను 14 ప్రభుత్వ కళాశాలలు , 14 ప్రభుత్వ రంగ కళాశాలలు, మరో 15 ప్రైవేటు కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలకు సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,412 మంది, ద్వితీయ సంవత్సరం విద్యా ర్థులు 2,682 మంది ఉన్నారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తర్వాత రెండు గంటల నుండి 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరగను న్నాయి. అందుకు 43 మంది చీప్ సూపర్ ఇంటెండెంట్ లను జిల్లా 14 అధికారులు నియమించారు. కానీ కేవలం ప్రభుత్వ కళాశాలలోనే సీసీ కెమెరా నిగ పర్యవేక్షణలో ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేక పోలేదని విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు కళాశాలల యాజమా న్యాలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేకా తర చేస్తూ సిసి కెమెరాలను ఏర్పాటు చేయక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయని భావిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో పాస్ గ్యారెంటీ అనే విధంగా కొందరి విద్యార్థుల నుండి డబ్బు లు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై జిల్లా నోడ ల్ అధికారి వెంకటరమణ వివరణ ఇస్తూ ప్రైవేటు కళాశాలలో వన్ సైడ్ సిసి నిఘా తప్పనిసరిగా ఏర్పాటు చేశామని పరీక్ష జరు గుతున్న సమయంలో రికార్డింగ్ ఉందని ఎలాంటి మాస్కాపింగ్ ఇతర వ్యవహారాలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య ప్రాక్టికల్స్ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.