20-03-2025 02:21:58 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు ముగిశాయి. బుధవారం కెమిస్ట్రీ పేపర్ కామర్స్ పేపర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలతో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు ముగిసినట్లే. నేటితో సెకండియర్ ప్రధాన పరీక్షలు కూడా ముగియనున్నాయి. అయితే ఈ నెల 25న బ్రిడ్జి కోర్సు ఎగ్జామ్స్‌తో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి. పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి.