calender_icon.png 1 March, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

01-03-2025 12:00:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 28 : మార్చి, 5 నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మార్చి, 5 నుంచి 25 వరకు నిర్వహించనున్న  ఇంటర్మీడియట్ పరీక్షలు ,రాష్ర్టంలో ఎల్.ఆర్.ఎస్ ల పురోగతిపై  శుక్రవారం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లతో ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ సహా  ఏ ఒక్కరూ మొబైల్  ఫోన్ లోపలికి  తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని. ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ (ఇన్చార్జి) సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జడ్పి సీఈఓ యాదయ్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిపిఒ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.