calender_icon.png 4 March, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి

04-03-2025 12:10:20 AM

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ సైదులు, ఎస్‌ఐ సతీష్

మహబూబాబాద్, మార్చి 3 (విజయ క్రాంతి) : ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని,పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మరిపెడ తహసీల్దార్ డి.సైదులు అన్నారు.సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల,టీఎస్ మోడల్ కళాశాల మరిపెడ లను ఎస్‌ఐ సతీష్ తో పరిశీలించారు.ఛీఫ్ సూపరింటెండెంట్ ఆదేశానుసారం పరీక్ష సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.