15-02-2025 01:31:03 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): సీసీటీవీ నిఘాలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను అమలు చేసి, పరీక్షలు పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు విశ్వేశ్వర్‌రావు, జ్యోత్స్నారెడ్డి శుక్రవారం సందర్శించారు. మొదటి సా రిగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వారికి వివరించారు.