05-03-2025 06:44:27 PM
217 మంది విద్యార్థులకు గాను 200 మంది హాజరు..
17 మంది గైర్హాజరు..
చర్ల (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చర్ల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో 217 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా అందులో పరీక్షకు హాజరైన విద్యార్థులు 84 మందికి గాను 9 మంది గైర్హాజరు అయ్యరని, 133 మంది వొకేషన్సల్ (వృత్తి విద్య) విద్యార్థులకు గాను 8 మంది గైర్హాజరు ఐయ్యారని ప్రిన్సిపాల్ నరేంద్ర తెలియచేశారు.
పరీక్షా కేంద్రం వద్ద ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశానుసారం లైవ్ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పరీక్షలు జరుగుతున్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగలేదని విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరుకావాలని పరీక్షలు రాయబోవు విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్ష రాసేందుకు ప్రవేశం కల్పిస్తున్నామని సమయపాలన పాటించాలని ప్రిన్సిపాల్ నరేంద్ర ఈ సందర్భంగా తెలియజేశారు.