24-02-2025 10:38:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్లో 13167, పదవ తరగతిలో 9710 విద్యార్థులు పరీక్షలు రాయడానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తాగునీటి సౌకర్యం డెస్కులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పరుశురాం రామారావు పద్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.