హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.2,500తో ఈ నెల 16 వరకు పొడిగించినట్టు సోమవారం బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ అవకాశాన్ని రెగ్యులర్, ఫేయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.