calender_icon.png 18 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

18-01-2025 01:01:24 AM

మిక్స్‌డ్ ఆక్యూపెన్సీ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్‌కు చాన్స్

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు గడువును ఇంటర్ బోర్డు పెంచింది. ఈనెల 25 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంకా ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆలస్య రుసుము రూ.2,500 తో ఫీజు కట్టుకుకోవాలని శుక్రవారం బోర్డు ప్రక టించింది.

రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యార్థులు సైతం ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించింది. ఇటీవల మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న దాదాపు 217 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

2024-25 విద్యాసంవత్స రానికి గానూ ఫైర్ ఎన్‌వోసీ నుంచి హోంశాఖ మినహాయింపునిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలోనే ఆయా కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోవ ద్దనే ఉద్ధేశంతో వార్షిక ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి జరగనున్న విషయం తెలిసిందే.