11-04-2025 01:18:00 AM
రూ. 25 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): దొంగతనాలనే వృత్తిగా చేసుకుని, జగిత్యాలతో పాటూ పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని జగిత్యాల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు రూ. 25 లక్షల విలువ గల 286.570 గ్రాములు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నాడు. దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న అజయ్ మొదట హైదరాబాద్లోని ఓ ట్రాన్స్పో ర్ట్లో పనిచేసి, అతని యజమాని జీతం ఇవ్వడం లేదని మొట్టమొదటగా లారీలోని డెక్కును దొంగతనం చేసి పోలీసులకు దొరికాడు.
అనంతరం హైదరాబాదులో పలు దొంగతనాలకు పాల్పడి చంచల్’గుడ జైలుకు వెళ్లి వచ్చాడని, జైలు నుండి వచ్చి దొంగతనాన్నే తన వృత్తిగా ఎంచుకొని వివిధ ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేశాడు. ఇప్పటి వరకు 25 దొంగతనాలకు పాల్పడిన నేరస్థుడు అజయ్ జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. జగిత్యాల పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ చౌరస్తాలో గురువారం వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పద స్థితిలో తిరుగుతున్న నేరస్తున్ని పట్టుకున్నట్లు తెలి
పారు. అతని వద్ద బంగారు నగలు పట్టుబడగా, పూర్తి విచారణ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించినట్లు ఎస్పీ వివరించారు. దొంగను పట్టుకొని అతని వద్ద నుండి దొంగ సొత్తు రికవరీలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్త్స్రలు కిరణ్, గీత, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్లు విశాల్, జీవన్, మల్లేష్, గంగాధర్, సంతోష్, రాజిరెడ్డిలను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి, రివార్డులు అందజేసారు.