calender_icon.png 23 April, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా నేరస్తుడు అరెస్టు

22-04-2025 08:56:19 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాతో పాటు వివిధ జిల్లాలలో తాళం వేసి ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. మంగళవారం కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... గత రెండు మూడు సంవత్సరాలుగా వివిధ జిల్లాలలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్న విషయమై దేవునిపల్లిలో (సి ఆర్ నెంబర్ 488/2024) ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఈ నేరాలలో నేరస్తుడైన పంది గోటి రాము వివిధ జిల్లాలలో తిరిగి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ ఇండ్లలో బీరువాలను పగలగొట్టి అందులో ఉన్న విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులను దొంగలించినాడు.

ఈ కేసుల విషయములో జిల్లా ఎస్పీ కామారెడ్డి ఉత్తర్వుల మేరకు ఏఎస్పి కామారెడ్డి కేసులను చేధించుటకై 2, స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. 2 స్పెషల్ టీమ్ లలోని అధికారులు వారి వద్ద ఉన్న కొద్దిపాటి ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసి పైన తెలిపిన నేరాలకు పాల్పడిన అంతర్ జిల్లా నేరస్తుడు ని పట్టుకోవడం జరిగినది. ఈ అంతర్ జిల్లా నేరస్తుడు తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని తాళం వేసిన ఇంటి తలుపుల తాళములను ఇనుప రాడ్డు సాయంతో పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలను పగలగొట్టి అందులోనుండి విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులను దొంగలించినాడనీ అట్టి వస్తువులను తన స్నేహితుల సాయంతో బంగారపు షాపు యజమానులలో వద్ద తను దొంగిలించిన బంగారపు, వెండి సొత్తును అక్కడ అమ్మి మద్యం తాగుతూ, పేకాట ఆడుతూ జల్సా చేస్తూన్నాడు.

అతన్ని అరెస్టు చేసి అతన్ని  అతనితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నేరస్తుల నుండి దేవునిపల్లి పోలీస్ వారు  సిసిఎస్ టీం కలిసి పట్టుకోవడం జరిగిందన్నారు. వారి నుండి 6 తులాల బంగారు ఆభరణాలను, 500 కేజ్ వెండి ఆభరణాలను వారి నుండి స్వాధీన పరచుకోనైనదన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన పండిగోటి రాము, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు బదనాపురం మల్లేష్, వడ్డెర నవీన్, తూప్రాన్ మండల కేంద్రానికి చెందిన శ్యామలాల్, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు రానివార్ రాజారాం, ముల్లేవ గౌతం చౌదరి, పైన అంతర్ జిల్లా నేరస్థుడుతో పాటు మరో ఐదుగురు నిందితులను దేవనపల్లి పోలీసు అరెస్టు చేయడం జరిగిందన్నారు.

వీరిని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందనీ, వీరు నిజామబాద్ జిల్లాలోని బోదన్, భీంగల్ పోలీసు స్టేషన్ ల మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ లో  నేరాలు చేసి ఉన్నారన్నారు. వారి నుండి 6 తులాల బంగారు ఆభరణాలను ,500 గ్రాముల వెండి ఆభరణాలను వారి నుండి స్వాధీన పరచుకోనైనది. ఈ కేసులను చేదించిన ఎఎస్పీ కామారెడ్డి, కామారెడ్డి రూరల్ సి.ఐ.ఎస్.రామన్, సీసీఎస్, సిఐ శ్రీనివాస్, దేవునిపల్లి,ఎస్పై జి. రాజు, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, పిఎ స్ సిబ్బంది (ఎడ్ కానిస్టేబుల్ - కృష్ణ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ రవి కిరణ్, రామస్వామి,వి శంకర్, రాజు, సీసీఎస్ సిబ్బంది స్వామి, శ్రీను, మైసయ్య, లక్ష్మి కాంత్ లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగిందన్నారు.