calender_icon.png 5 April, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్

05-04-2025 01:57:31 AM

  • 24 బైక్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం పట్టుబడిన వాహనాల 
  • విలువ రూ.18 లక్షలు వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ 

నల్లగొండ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 24 బైక్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. నకిరేకల్ పోలీస్ స్టేషన్లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డితో కలిసి శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.

నకిరేకల్ పట్టణంలో వరుస బైక్ చోరీలు జరుగుతుండడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 3న సాయంత్రం నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ లచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరాస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు.

ప్యాషన్ ఫ్రో  బ్పై వస్తున్న నకిరేకల్ పట్టణానికి చెందిన పాలడుగు అశోక్, నెంబర్ ప్లేట్ లేకుండా స్ప్లెండర్ ప్లస్ బైక్లపై తిప్పర్తి రోడ్డు వైపు నుంచి వస్తున్న నార్కెట్పల్లి మండలంలోని అక్కినెపల్లి, తిరుమలగిరి గ్రామాలకు చెందిన ఏర్పుల పరుశురాములు, బోడ సాయిరాంను నిలిపి ధ్రువపత్రాలు చూపమన్నారు.

పత్రాలేవీ లేకపోవడంతో అనుమానం వచ్చి అశోక్కు చెందిన బైక్ నెంబర్ను ఈ- చలాన్ యాప్లో తనిఖీ చేయగా గ్లామర్ మోడల్ చూపింది. దీంతో పోలీసులు వారిని విచారించగా బైక్ చోరీలు వెలుగు చూశాయి. నిందితులు ముగ్గురు నకిరేకల్లో 9, సూర్యాపేట, చౌటుప్పల్లో 2 , హయత్ నగర్లో 3, వనస్థలిపురంలో ఒకటి, ఎల్బీనగర్లో 5, చైతన్యపురి ఓ బైక్ను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించారు.

హోటళ్లు, బార్లు, ఇండ్ల ఎదుట నిలిపిన బైక్లను పాతతాళం చెవిల సాయంతో నిందితులు దొంగిలించే వారని ఎస్పీ తెలిపారు. అపహరించిన వాటిలో 11 బైక్లను పరశురాములు, సాయిరాం తెలిసిన వారికి విక్రయించారని, మిగిలిన 13 బైక్లను నిర్మాణంలో ఉన్న అశోక్ ఇంటి వెనుక దాచారని వెల్లడించారు. చోరీల కేసులను ఛేదించిన నకిరేకల్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.