05-04-2025 12:00:00 AM
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో క్లాసులు నడుపుతున్న ఇంటర్ కాలేజీలను మూసెయ్యాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించినప్పటికీ నగరంలోని కార్పొరేట్ కాలేజీలు సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయ ని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డబ్బులకు లొంగి ఇంటర్మీడి యెట్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరరోపించారు. వేసవిలో క్లాసులను నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.