calender_icon.png 31 January, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులాంతర వివాహమే కృష్ణ హత్యకు కారణం

30-01-2025 12:00:00 AM

  1. ఈనెల 26న జరిగిన హత్య 
  2. కేసును ఛేదించిన పోలీసులు
  3. ఆరుగురు అరెస్టు
  4. ఓ కారు.. ఐదు మొబైల్ ఫోన్ల్లు స్వాధీనం

సూర్యాపేట, జనవరి 29 : ఈనెల 26న రాత్రి జిల్లాలోని పిల్లలమర్రి గ్రామ సమీపం లో కిరాతకంగా హత్యకు గురి అయిన వడ్లమూడి కృష్ణ అలియాస్ మాలబంటి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లో చేదించి హత్యకు కారకులైన ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు ఓ వ్యక్తిగా కారు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అసలు హత్యకు కారణం కులాంతర వివాహమే అని తేల్చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం విలేకరులకు వివరించారు. కృష్ణ పిల్లలమర్రి గ్రామానికి చెందిన భార్గవ్ని ప్రేమించి గత ఆగస్టు నెలలో కులాంతర వివాహం చేసుకొని సూ ర్యాపేటలో నివాసం ఉంటున్నట్లు తెలిపా రు. ఈ క్రమంలో ఈ వివాహం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయమును మనసులో పెట్టుకొని కృష్ణ హత్యకు ఇప్ప టికే మూడుసార్లు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అయితే ఈ నెల 26న బైరు మహేష్ అనే వ్యక్తి వ్యాపార సంబంధమైన విషయమును చర్చించుకుందామని కృష్ణను పిలిచాడన్నారు. చర్చలు నడపడా నికి వెళుతూ మద్యం బాటిల్లు తీసుకువెళ్లి మహేష్ మధ్యమునుసేవించగా కృష్ణ మాత్రం కూల్ డ్రింక్ మాత్రమే సేవించా డన్నారు.

మూడు నాలుగు గంటలు చర్చలు జరిగిన తదుపరి ఇంటికి వెళ్దామని చెప్పగా కృష్ణ తన స్కూటీని ఎక్కగానే వెనకాల ఎక్కిన మహేష్ అక్కడే చెట్లపొదల్లో వేచి చూస్తున్నా భార్గవి సోదరులైన నవీన్, వంశీలకు విషయం తెలిపాడన్నా రు. వారు అక్కడికి చేరుకునేసరికి వెనకాల కూర్చున్న మహేష్ కృష్ణ మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా ఒత్తిపట్టగా వంశీ అతని కాళ్లు పట్టుకోగా నవీన్ మెడను గట్టిగా నొక్కి పట్టాడన్నారు.

తదుపరి ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి అక్కడికక్కడే చంపేశారన్నారు. చనిపోయాడని నిర్ధారిం చుకున్న తర్వాత నవీన్ తన వెంట తెచ్చిన ఎర్టిగా కారులో అప్పటికే ఉన్న ప్లాస్టిక్ బస్తాన్ని తీసి కృష్ణ శవాన్ని అందులో పెట్టి మూట కట్టారు అన్నారు.

నాన్నమ్మకు చూయించేందుకు పాత సూర్యాపేటకు

అయితే చనిపోయిన కృష్ణా శవాన్ని తన బంధువుల ఇంటిలో పాత సూర్యపేటలో అప్పటికే ఉన్న నాన్నమ్మ బుచ్చమ్మకు చూయించేందుకు శవాన్ని కారులో వేసుకొని అక్కడికి తీసుకువెళ్లి చూపించార ని తెలిపారు.       

మిత్రుడి కోసం నల్గొండకు..

అదేవిధంగా నల్గొండలోని తన మిత్రుడు సాయి చరణ్ కు శవాన్ని సూచించేందుకు అతని వద్దకు వెళ్లి చూపించగా అతను భయపడి కారు దిగి వెళ్లిపోయాడని చెప్పారు.

శవంతోనే తిరుగు పయనం 

కృష్ణ శవాన్ని ఎక్కడో వేయాలని ఉద్దేశం తో నల్గొండకు వెళ్లిన నవీన్, మహేష్ లు సాయి చరణ్ భయపడి వెళ్లిపోవడంతో శవంతో తిరిగి పాత సూర్యాపేటలోని తన నానమ్మ వద్దన్న బంధువుల ఇంటి వద్దకు వచ్చారు. తదుపరి అక్కడే ఉన్న వంశీని స్కూటీ నడుపుతూ కారును ఫాలో కావని సూచించారు.

కారు స్కూటీ రెండు నడుపు తూ ముగ్గురు కలిసి పిల్లలమర్రి గ్రామ శివారులోని చెరువు కట్ట వద్దకు వెళ్లి శవంను కారు నుండి బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ విప్పి కృష్ణ శవమును బయట పెట్టారన్నారు. దాని పక్కనే అతని స్కూటర్ను పెట్టి, ప్లాస్టిక్ కవర్ దానికి కట్టిన తాడును కారులో వేసుకొని తిరిగి సూర్యా పేటకు బయలుదేరారన్నారు.

క్రమం లో మార్గమధ్యంలో బాల్యంలో వద్ద ఎస్‌ఆర్ ఎస్పి కాల్వలో వాటిని వదిలేసి బంధువుల ఇంటికెళ్లి పడుకున్నారన్నారు. తదుపరి ముగ్గురు కలిసి హైదరాబాద్ కు వెళ్లి మంగళవారం ఇంటికి రాగా బుధవారం వారిని పట్టుకున్నట్లు తెలిపారు. 

ఆరుగురు అరెస్ట్ : 

మొత్తం హత్యతో సంబంధం ఉన్న భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీ, ఆమె తండ్రి సైదులు, నాన్నమ్మ బుచ్చమ్మ, వైరు మహేష్ సాయిచరణ్లను అరెస్టు చేయడం తో పాటు ఓ వ్యక్తిగా కారు ఐదు మొబైలు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పి రవి సిఐ రాజశేఖర్ ఎస్‌ఐ బాలునాయక్ సిబ్బంది పాల్గొన్నారు.