03-04-2025 12:31:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): వేసవి సెలవుల ప్రకటన విషయంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై 25న ముగిశాయి. విద్యార్థులకు మార్చి 30 నుంచి సెలవులని ప్రకటిస్తూ ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం అధికారిక ప్రకటనను ఇంటర్ బోర్డు వాట్సాప్ గ్రూపులో విడుదల చేసింది.
మార్చి 29న ఇవ్వాల్సిన ప్రకటనను ఏప్రిల్ 2న ఇవ్వడంపై ఇంటర్ బోర్డు అధికారుల ఆలసత్వం కనిపించిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును గ్రహించిన ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే ప్రకటనను సోషల్ మీడియా గ్రూపు నుంచి తొలగించారు.