25-02-2025 01:05:05 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 24: వనపర్తి జిల్లాలో మార్చి, 5 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా మార్చి, 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. వనపర్తి జిల్లాలో ఈ సారి 12150 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6457 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 5693 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
మార్చి, 21 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 6887 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6853 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 34 మంది ఒకసారి ఫెయిల్ అయినవారు కంపార్ట్మెంట్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ (ఇన్చార్జి) యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిస్పి కే. ఉమామహేశ్వర రావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.